తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నేడు సభలో ఇంట్రెస్టింగ్ సీన్ చోటు చేసుకుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బావ గారు అని సంభోదించారు. కొత్త మండలాలు, డివిజన్ల ఏర్పాటుపై సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన పొంగులేటి కోమటిరెడ్డిని బావ గారు అని సంబోధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.