హైకోర్టు నోటీసులపై మాజీ మంత్రి , వైసీపీ సీనియర్ లీడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. తనకు ఇంకా ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు. నోటీసులు అందినప్పుడు న్యాయపరంగా దానికి బదులిస్తానని చెప్పారు. అయితే కొన్ని మీడియా ఛానెళ్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్న పెద్దిరెడ్డి.. వాటికి నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. త్వరలోనే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలతో ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా ఫీజు కట్టి వైద్యం చేయించుకోవాల్సి వస్తుందని ఆరోపించారు.