కోర్టు సంచలన తీర్పు.. టీడీపీ ఎమ్మెల్యే ఆస్తులను స్వాధీనం చేసుకొండి

11 months ago 22
ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. ఆయన తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కడప కోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడు కొండారెడ్డి ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవాలని కోర్టు తీర్పు చెప్పింది. గోపవరంలోని కామిశెట్టి కాలేజీ స్థలాన్ని స్వాధీనం చేసుకుని హైదరాబాద్‌కు చెందిన పృధ్వీ కంపెనీకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 16లోపు ఆస్తిని అప్పగించాలని తెలిపింది.
Read Entire Article