వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను మరింత సులభతరం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఏపీ ప్రజలకు త్వరలోనే డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రి నారా లోకేష్.. వాట్సాప్ గవర్నెన్స్ గురించి వివరించారు. అలాగే త్వరలోనే వాట్సాప్‌లోనే డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేస్తామని.. క్యూఆర్ కోడ్‌తో రేషన్ పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.