Azharuddin ED Inquiry: హైదరాబాద్ క్రికెట్ అసోసియేష్ మీద ఇప్పటికే రకరకాల ఆరోపణలు వెల్లువెత్తుండగా... నిధుల గోల్‌మాల్ వ్యవహారంలో తాజా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్సీఏలో మనీ లాండరింగ్ జరిగిందంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో.. ఇప్పటికే భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌పై కేసులు నమోదు కాగా.. ఈరోజు (అక్టోబర్ 08న) ఎన్‌ఫోర్ట్సమెంట్ డైరెక్టర్ ముందు విచారణకు హాజరయ్యారు. అజారుద్దీన్ ఈడీ విచారణకు హాజరు కావటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.