తెలంగాణలోని క్రికెట్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ శుభవార్త అందించింది. ఐపీఎల్ సందర్భంగా ఏర్పాటు చేసే ఫ్యా్న్ పార్క్ నగరాల జాబితాలో తెలంగాణలోని నిజామాబాద్‌ను ఎంపిక చేసింది. ఐపీఎల్ మ్యాచ్‌లను చూడలేని వారి కోసం.. మారుమూల ప్రాంతాల్లో ఉండే క్రికెట్ లవర్స్ కోసం ఇలాంటి ఫ్యాన్ పార్క్‌లను బీసీసీఐ ఏర్పాటు చేస్తోంది.