ఏపీలో త్వరలోనే మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి రానుంది. మంగళగిరిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ స్టేడియం నిర్మాణం పూర్తి చేసి ఆరు నెలల్లోగా అందుబాటులోకి తెస్తామని విజయవాడ ఎంపీ, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని తెలిపారు. అలాగే విజయవాడలో క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు సైతం కృషి చేస్తున్నట్లు వివరించారు. ఏసీఏ అధ్యక్షుడిగా కేశినేని చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనిపై వచ్చే నెలలో అధికారికంగా ప్రకటన రానుంది. మరోవైపు ప్యానెల్‌లోని ఆరు పదవులు ఏకగ్రీవమయ్యాయి.