ఓ మైనర్ తన ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డాడు. ఏకంగా రూ.8 లక్షల నగదు, 9 తులాల బంగారంతో ఇంట్లో నుంచి పరారయ్యాడు. పోతూ పోతూ క్షమించండి నాన్న అంటూ లెటర్ కూడా రాసి వెళ్లాడు. దీంతో అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే ఆ మైనర్.. గతంలో రెండు సార్లు కూడా ఇలాగే ఇంట్లో నుంచి పారిపోయినట్లు తల్లిదండ్రులు చెప్పారు.