అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి రూ. 549.95 కోట్లు కొల్లగొట్టిన ఖమ్మం జిల్లాకు చెందిన పదిమంది నిందితులపై పోలీసులు సస్పెక్ట్ షీట్ తెరిచారు. ఉడతనేని వికాస్ చౌదరి ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ ముఠా.. మ్యాట్రిమోని, క్రిప్టో, బెట్టింగ్ పేరిట సామాన్యులను మోసగించింది. నిరుద్యోగుల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిపించి ఈ భారీ స్కామ్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. వీరిపై నిరంతర నిఘా ఉంచుతూ ఆర్థిక లావాదేవీలను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.