తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వరదలు ప్రజలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఖమ్మం లాంటి ప్రాంతంలో మున్నేరు వాగు ఉగ్రరూపానికి తీర ప్రాంతాలు కకావికలమయ్యాయి. కాగా.. వరద బాధితుల కోసం పెద్ద ఎత్తున విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే.. ఖమ్మం వరద బాధితులకు హెటిరో డ్రగ్స్ అధినేత, ఎంపీ బండి పార్థసారధి భారీ విరాళం ప్రకటించారు. విరాళంగా కోటి రూపాయలు ప్రకటించిన పార్థసారధి.. ఆ చెక్కును ఖమ్మం కలెక్టర్‌కు అందజేశారు.