గంజాయి సాగును నివారించేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రయోగాత్మకంగా అవకాడో సాగును ప్రారంభించారు. ఆరు ఎకరాల్లో అవకాడో సాగు చేసేందుకు గానూ.. స్థానికులకు విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. అవకాడోను ఎకరా పొలంలో సాగుచేస్తే నాలుగు లక్షల వరకూ లాభాలు వస్తాయంటున్న అధికారులు.. ఇప్పటికైనా గంజాయి సాగు వదిలి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టాలని స్థానికులకు సూచిస్తున్నారు. మరి వీరి ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.