మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు ఒక్కచోట చేరారు. 2024 ఎన్నికల సమయంలో ప్రత్యర్థులుగా తలపడి కత్తులు దూసుకున్న ఇద్దరు నేతలు.. ప్రస్తుతం ఒక్కచోట చేరారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావ వివాహ వార్షికోత్సవం ఓ రిసార్టులో జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే అవంతి శ్రీనివాసరావు కూడా ఈ కార్యక్రమానికి హాజరై గంటా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.