హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన యోగా డే వేడుకల్లో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. యోగాసనాలు ముగిసిన అనంతరం గేట్ నెం. 2 వద్ద ఉచిత అల్పాహారం పంపిణీ చేయనున్నారని ప్రకటించడంతో భారీగా జనం పోటెత్తారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లగా సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు.