Ap Govt On Gali Janardhan Reddy Affidavit: గాలి జనార్ధన్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వం.. ఏపీ సరిహద్దులో గాలి జనార్ధనరెడ్డి కంపెనీకి మైనింగ్ అనుమతి ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదంటూ ఇచ్చిన అఫిడవిట్‌పై సమీక్ష చేస్తామని సుప్రీం కోర్టుకు తెలిపింది. దీంతో కోర్టు తదుపరి విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. అమికస్ క్యూరీ నివేదికపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది.