ఏపీ ప్రభుత్వం పర్యాటక రంగం మీద ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనేక చర్యలు చేపడుతున్నారు. తాజాగా విజయవాడలోని మూలపాడు నగరవనం అభివృద్ధికి ఏపీ అటవీశాఖ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. విజయవాడ, అమరావతికి సమీపంలో ఈ మూలపాడు నగరవనం ఉండటంతో.. ఇక్కడ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి ప్రకృతి ప్రేమికులను ఆకర్షించాలనేది అధికారుల ఆలోచన. అందులో భాగంగా మూలపాడు నగరవనంలో దసరా రోజున జంగిల్ సఫారీని ప్రారంభించే యోచనలో అధికారులు ఉన్నారు.