తెలంగాణలోని గిరిజనులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుభవార్త తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.12,600 కోట్లతో 'ఇందిరా సౌరగిరి జలవికాస పథకం' ప్రారంభించనుందని అన్నారు. ఈ నెల 18న నాగర్‌కర్నూల్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఐదేళ్లలో 2.10 లక్షల మంది గిరిజన రైతులకు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించటమే ఈ పథకం లక్ష్యమన్నారు.