అన్నం పెట్టిన యజమానికే గుమాస్తా సున్నం పెట్టిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. గుంటూరు నగరంపాలెం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహేంద్ర వర్మ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ఓ కారం మిల్లులో గుమాస్తాగా పనిచేసేవాడు. అయితే యజమానికి తెలియకుండా మహేంద్ర వర్మ మిల్లులోని మిర్చి బస్తాలను దొంగచాటుగా అమ్ముకున్నట్లు తేలింది. యజమాని ఫిర్యాదుగా ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.