Guntur Woman Incident: గుంటూరులో వరంగల్‌కు చెందిన యువతి మరణం మిస్టరీగా మారింది. భర్త ఆత్మహత్య చేసుకుందని చెబుతుంటే.. యువతి తండ్రి మాత్రం భర్త చంపాడని చెబుతు్నారు. ప్రేమ పెళ్లి చేసుకొని ఆరు నెలలు తిరగక ముందే తన కుమార్తెను భర్త వేధించి చంపేశాడని యువతి తండ్రి జగదీశ్వరాచారి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె ప్రాణాలు బలితీసుకున్న సాయి కుమార్‌ను కఠినంగా శిక్షించాలని గుంటూరులోని నిందితుడి ఇంటి వద్ద మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు.