Guntur Work From Home Cheating: ఇన్‌స్టాలో ఓ అందమైన అమ్మాయి వీడియోలను చూశారు.. నెలకు ఈజీగా రూ.50వేలు సంపాదించొచ్చని ఆశపడ్డారు. అందులోనూ వర్క్ ఫ్రం హోం అని చెప్పడంతో ఎగిరి గంతేశారు.. ఇంకేముందు లింక్ క్లిక్ చేసి వాళ్లు చెప్పినట్లు చేశారు. సీన్ కట్ చేస్తే మోసపోయామని గ్రహించారు.. వెంటనే గుంటూరు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాలో హైదరాబాద్‌కు చెందిన యోగేష్, నందీశ్వర్, పవన్‌లు మోసపోయారు. మోసం చేసిన వ్యక్తిది గుంటూరు కావడంతో అక్కడ ఫిర్యాదు చేశారు.