వైఎస్ఆర్‌సీపీలో ఉన్నప్పుడు.. ఆ పార్టీ అధినేత, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నరసాపురం ఎంపీ ఘురామకృష్ణం రాజు బాహటంగా విమర్శలు గుప్పించారు. ఆ పార్టీలో ఆయన తొలిసారి తిరుగుబాటు చేసి.. ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో ఎంపీగా ఉన్న ఆయనపై ఏపీ సీఐడీ కేసు పెట్టి.. అరెస్ట్ చేసింది. కస్టడీలో ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అప్పట్లో సంచలనంగా రేపింది. దీనిపై అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ తెరపైకి వచ్చింది.