గుంటూరు జిల్లాలోని ఓ గ్రామంలో గత ఐదు నెలల్లో 30 మంది చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. వరుస మరణాల పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మరణాలకు కారణం తెలియక గ్రామస్తులు భయపడుతున్నారు. విషయం తెలుసుకున్న వైద్య అధికారులు గ్రామంలో పర్యటించి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. అలానే మంచి నీటిని కూడా పరీక్షల కోసం పంపారు. వీటి ఫలితాలు వస్తే.. ఈ వరుస మరణాల మిస్టరీ వీడే అవకాశం ఉంది..