దేశంలోనే ఉత్తమ జిల్లాలలో ఒకటిగా గుంటూరు జిల్లాను నిలుపుతామని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని ప్రాంతంలో కిమ్స్ ఆస్పత్రి నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. అమరావతి, తెనాలి, గుంటూరు, మంగళగిరిని కలిపి అభివృద్ధి చేస్తే దేశంలోనే అత్యుత్తమ జిల్లాగా గుంటూరు నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. 190 కి.మీ ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి అయితే.. దేశంలోనే పొడవైన ఔటర్ రింగ్ రోడ్డు కలిగిన నగరంగా అమరావతి నిలుస్తుందన్నారు.