సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ముసుగులో అమ్మాయిలను మోసం చేస్తున్నాడంటూ ఓ వ్యక్తిపై ఇద్దరు మహిళలు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రోజున గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. శ్రీకాంత్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. తమను ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడంటూ ఇద్దరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.