Guntur Sp Ask For Foreigners Details: గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ప్రజల్ని అప్రమత్తం చేశారు. జిల్లాలో విదేశీయులకు వసతి కల్పించేవారికి కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. వెంటనే విదేశీయుల వివరాలను పోలీసులకు తెలియజేయాలని సూచించారు. దీని కోసం ఓ వెబ్‌సైట్‌లో వారి వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా విదేశీయులకు వసతి కల్పించి వివరాలను తెలియజేయకపోతే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు.