Gujarat Red Sandalwood Smugglers Arrested: గుజరాత్‌లోని పటాన్‌లో ఏపీ పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. అక్కడ స్థానిక పోలీసుల సహకారంతో గోడౌన్‌లలో తనిఖీలు చేశారు. అక్కడ 5 టన్నుల ఎర్రచందనం దుంగలను ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 155 ఎర్రచందనం దుంగలతో పాటు, ముగ్గురు స్మగ్లర్లను గుజరాత్ పోలీసుల సాయంతో ఏపీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్లను ట్రాన్సిట్ వారంట్‌పై ఏపీకి తరలిస్తామని పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనాన్ని తిరుపతికి తరలిస్తామని చెప్పారు.