Chandrababu at Kothacheruvu PTM: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించారు. కొత్తచెరువులో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్‌లో పాల్గొన్నారు. పేరెంట్ టీచర్ మీటింగ్‌లో భాగంగా విద్యార్థులతో చంద్రబాబు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ మహిళ చేసిన ప్రసంగం వైరల్ అవుతోంది. సీఎం చంద్రబాబును చూడగానే గురుపౌర్ణమి రోజు పున్నమి చంద్రుణ్ని దర్శించుకున్నానంటూ ఆ మహిళ ఎమోషనల్ అయ్యింది.