'గూండాయిజానికి భయపడను.. మహిళా ఎంపీని గౌరవించడం నేర్చుకోండి'.. మంత్రి శ్రీహరిపై డీకే అరుణ ఫైర్

4 months ago 20
వనపర్తి జిల్లా అమరచింత పెద్ద చెరువు సుందరీకరణ పనుల శంకుస్థాపనలో ప్రోటోకాల్ వివాదం ముదిరింది. ఎంపీ డీకే అరుణను ఆహ్వానించకుండా మంత్రి శంకుస్థాపన చేయడాన్ని నిరసిస్తూ ఆమె ఇవాళ భూమి పూజ చేశారు. ఈ క్రమంలో బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా.. నిరసనల మధ్యే పనులు ప్రారంభించారు. కేంద్ర నిధులను రాష్ట్ర నిధులుగా ప్రచారం చేస్తున్నారని.. మహిళా ఎంపీ అని చూడకుండా దాడులకు దిగడం హేయమైన చర్య అని డీకే అరుణ ప్రభుత్వంపై మండిపడ్డారు.
Read Entire Article