తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బెండాలపాడులో పర్యటించారు. అక్కడ ఇందిరమ్మ ఇండ్ల పైలాన్‌ను ప్రారంభించి.. కొత్త ఇళ్లలోకి మారిన కుటుంబాలతో గడిపారు. వచ్చే రెండేళ్లలో మరో 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం వంటి ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయో లేదో పరిశీలించారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంపై నిర్లక్ష్యం వహించిందని ఆయన విమర్శించారు.