Gruha Jyothi Scheme: అన్ని అర్హతలు ఉన్నా గృహజ్యోతి పథకం కింద జీరో కరెంట్ బిల్లులు రాని వారికి విద్యుత్ పంపిణీ సంస్థలు శుభవార్త చెప్పాయి. ఆయా వినియోగదారులు సమీపంలోని విద్యుత్ కేంద్రాలకు వెళ్లి అప్లయ్ చేసుకోవాలని సూచించాయి. మండల పరిషత్తు, మున్సిపల్, జీహెచ్‌ఎంసీ సరిల్ కార్యాలయాల్లోనూ ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయని.. అక్కడ కూడా చేసుకోవచ్చునని చెప్పాయి.