తెలంగాణలోని గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా..500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అందజేస్తుంది. అయితే.. 500 రూపాయలు మినహా.. వినియోగదారుడు ఏజెన్సీకి చెల్లించిన మిగతా మొత్తానికి వినియోగదారుని అకౌంట్‌లోకి 48 గంటల్లోనే జమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయా ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. జమ చేయటమే కాకుండా.. చేసినట్టుగా మెస్సేజ్ కూడా పంపించాలని సూచించింది.