తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పల్లెల్లో సందడి నెలకొంది. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా మతన్ గౌడ్ గ్రామ సర్పంచ్ ఎన్నిక దాదాపు ఏకగ్రీవమైంది. ఈ గ్రామానికి ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది. అయితే ఆ గ్రామంలో ఒకే ఎస్టీ కుటుంబం ఉండటంతో ఆ ఫ్యామిలీకి జాక్‌పాట్ తగిలినట్లు అయింది. ఈ కుటుంబం నుంచే ఓ వ్యక్తి సర్పంచ్‌గా ఎన్నిక కానున్నారు. అంతేకాకుండా రెండు వార్డు సభ్యుల స్థానాలు కూడా ఏస్టీ రిజర్వేషన్ కావడంతో.. వారు కూడా అదే కుటుంబం నుంచి ఉండనున్నారు.