గ్రామస్తులపై అఘోరీ ఆగ్రహం.. కత్తితో అర్ధరాత్రి హల్‌చల్

3 hours ago 1
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో అఘోరి తెగ హల్‌చల్ చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సూర్యాపేట జిల్లాలో అర్ధరాత్రి అఘోరి కత్తితో హల్‌చల్‌ చేసింది. చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామస్తులకు అఘోరికి మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణ చోటుచేసుకుంది. ఉండ్రుగొండ గ్రామస్తులు పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఎన్‌హెచ్‌ 65పై వద్ద అఘోరీ కనిపించింది. దీంతో వాహనదారులు, గ్రామస్తులు ఆమెను చూస్తూ వీడియోలు, ఫోటోలు తీశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అఘోరి.. వారితో వాగ్వాదానికి దిగింది. వెంటనే తన కారులో ఉన్న కత్తి తీసుకుని వారి వెంటపడింది. ఈ ఘటనతో అలర్ట్ అయి ఆగ్రహించిన గ్రామస్థులు కర్రలతో ఆమెపై దాడి చేసినట్టు తెలుస్తోంది. ప్రతిగా ఓ గ్రామస్థుడిపై కత్తితో అఘోరి దాడి చేయగా.. గ్రామస్తులంతా అక్కడి నుంచి పరారయ్యారు. తనకు గ్రామస్తులంతా క్షమాపణలు చెప్పాలని.. లేదంటే ఆ ఊరు విడిచి వెళ్లేది లేదంటూ అర్ధరాత్రి కత్తితో హల్‌చల్‌ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అఘోరికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు.
Read Entire Article