గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ల మీద తెలంగాణ హైకోర్టు నేడు తుది తీర్పు వెల్లడించింది. మెరిట్ లిస్ట్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మళ్లీ రీవాల్యుయేషన్ చేయాలని.. సాధ్యం కాకపోతే.. మరోసారి పరీక్ష నిర్వహించలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కొందరు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెరిట్ లిస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత దాన్ని రద్దు చేయడం, రీవాల్యుయేషన్ అంటే సమయం వృథా అవుతుందని వాపోతున్నారు. మరి దీనిపై కమిషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. పూర్తి వివరాలు మీకోసం