2015లో నిర్వహించిన గ్రూప్-2 ఫలితాలను ఇటీవల తెలంగాణ హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. 8 వారాల్లో మళ్లీ మూల్యాంకనం చేసి.. ఫలితాలు ప్రకటించాలని సింగిల్ జడ్జ్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే దీన్ని టీజీపీఎస్సీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్‌లో సవాలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం.. సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2015 గ్రూప్ 2 ర్యాంకర్లకు భారీ ఊరట లభించినట్లు అయింది.