హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మహమ్మద్ జాబ్రీ ములాఖత్ సమయంలో తన స్నేహితులతో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయటం ప్రస్తుతం కలకలం రేపుతోంది. జైలు నిబంధనలు ఉల్లంఘించి స్నేహితులు సెల్‌ఫోన్ లోపలికి తీసుకురావడం, ఖైదీ వీడియోలు అప్‌లోడ్ చేయడం భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు, ఆ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.