చంద్రబాబు.. తల్లికి వందనం కాదు.. తద్దినం పెట్టాడు.. టీటీడీ మాజీ ఛైర్మన్

2 months ago 4
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలపై టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. హామీలపై పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని భూమన మండిపడ్డారు. ‘‘చంద్రబాబు నాయుడు రాజకీయమంతా లాక్కోవడమే. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాద్రోహమే ఆయన నైజం.. ప్రజల సంక్షఏమం ఏమాత్రం పట్టించుకోరు.. అలాగే ఇప్పుడు కూడా కోట్లాది మందిని చంద్రబాబు మోసం చేస్తున్నారు. ఎన్నికల ముందు తమ అధినేత, నాటి సీఎం జగన్‌పై నిందలు వేశారు.. ఎన్ని కష్టాలు వచ్చినా హామీలు అమలు చేస్తామని ప్రగల్భాలు పలికారు.. ఇప్పుడు పచ్చి అబద్ధాలు చెబుతూ ఆచరణ సాధ్యం కాదని కపట నాటకం ఆడుతున్నారు. ప్రజా ద్రోహం, ప్రజలకు పొడిచే వెన్నుపోటు ఎలా ఉంటుందో నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు బయటపెట్టారు’’ అని కరుణాకర్ రెడ్డి విరుచుకుపడ్డారు.
Read Entire Article