వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన భాష మార్చుకోవాలని సూచించారు. చంద్రబాబు మంచితనం కారణంగానే వైఎస్ జగన్ గురించి టీడీపీ కార్యకర్తలు ఆగుతున్నారని అన్నారు. మీడియాతో మాట్లాడిన పెమ్మసాని చంద్రశేఖర్.. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు రౌడీల్లా ప్రవర్తించలేదా అని శ్నించారు. వంశీ అరెస్ట్ గురించి ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. జగన్ చేష్టలతో గత ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకు పరిమితమైందన్న పెమ్మసాని.. ఈ సారి ఒక్కటి మిగులుతుందంటూ ఎద్దేవా చేశారు.