Andhra Pradesh Creator Academy: ఏపీలో మరో ప్రతిష్టా్త్మక సంస్థ కొలువుదీరనుంది. ఏపీలో క్రియేటర్ అకాడమీ ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్ సింగపూర్ పర్యటనలో.. టెజరాక్ట్, యూట్యూబ్‌లతో ఏపీ ప్రభుత్వం ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనుంది.