Chandrababu Gudivada Auto Driver: గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. పేదలు, చిరువ్యాపారులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వారి జీవన పరిస్థితులు కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. వలివర్తిపాడుకు చెందిన రేమల్లి రజనీకాంత్ అనే ఆటో డ్రైవర్ గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం పొంది ఆటో ఓనర్ అయ్యానని చెప్పారు. డీజిల్ ఆటోను ఎలక్ట్రిక్ వాహనంగా మార్చుకుంటే ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుందని చెప్పారు.. ''నీ వాహనంతోనే ఈ విధానం ప్రారంభిస్తామని' అన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఎలక్ట్రిక్ ఆటో అందజేశారు.