తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి సమావేశమయ్యారు. బుధవారం విజయవాడ వెళ్లిన నాగం జనార్ధన్ రెడ్డి.. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో సీఎం నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. ఈ సందర్భంగా నాగం జనార్ధన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు.. ఆయనతో కాసేపు భేటీ అయ్యారు. నాగం జనార్ధన్ రెడ్డి ఆరోగ్యం, కుటుంబ యోగ క్షేమాల గురించి చంద్రబాబు ఆరా తీసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు పలు పాత ఘటనలను గుర్తు చేసుకున్నారు. పలు విషయాలపైనా చర్చించించుకున్నట్లు సమాచారం.