Chandrababu Daggubati Venkateswara Rao Hug: విశాఖపట్నం గీతం వర్సిటీ ఆడిటోరియంలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన 'ప్రపంచ చరిత్ర' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వేదికపై తోడల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం అందరినీ ఆకర్షించింది.