వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవ్వులు పూయించారు. ప్రకాశం జిల్లా నేతలతో వైఎస్ జగన్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. తమ హయాంలో ఐదు పోర్టుల నిర్మాణాన్ని ప్రారంభించామని వైఎస్ జగన్ చెప్పారు. సంపద సృష్టించడమంటే అదేనని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే చంద్రబాబును జగన్ ఇమిటేట్ చేశారు. చంద్గ్రబాబు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తోందని.. ఇప్పటికే ప్రజా వ్యతిరేకత మొదలైందన్నారు. బాదుడే బాదుడు మొదలెట్టారంటూ చంద్రబాబును జగన్ అనుకరించారు.