భాగ్యనగరంలో మరో రైల్వేస్టేషన్ అందుబాటులోకి రానుంది. డిసెంబర్ 28వ తేదీన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి చేతుల మీదుగా చర్లపల్లి రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవం జరగనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు అత్యాధునిక సదుపాయాలతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ అభివృద్ధి చేశారు. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక దూరప్రాంతాలకు వెళ్లే అనేక రైళ్లు ఇక్కడి నుంచే నడపనున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో ఎయిర్ పోర్టు తరహాలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ అభివృద్ధి చేశారు.