తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు అనూహ్యంగా పెరిగాయి. గత వారంతో పోలిస్తే కిలో ధర రూ. 20-30 వరకు పెరిగి, నగరాల్లో రూ. 260-280కి చేరుకుంది. కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో, ప్రోటీన్ ఆహారంగా చికెన్‌కు డిమాండ్ పెరగడమే దీనికి ప్రధాన కారణం. దుకాణదారులు ఈ పరిస్థితిని అవకాశంగా వాడుకుంటున్నారు. నేడు ఆదివారం కావడంతో.. దుకాణాల ముందు భారీ క్యూలు కనిపించాయి.. వ్యాపారస్థులు ధరలు పెంచినా.. వాటితో సంబంధం లేకుండా ప్రజలు మాంసం కొనుగోలు చేస్తున్నారు.