చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ మీద కొంతమంది దాడికి పాల్పడ్డారు. ఫిబ్రవరి 07న తెల్లవారుజామున నల్లబట్టలు ధరించిన కొంత మంది వ్యక్తులు రంగరాజన్ ఇంట్లో ప్రవేశించారు. తాము ఇక్ష్వాకు వంశస్థులమని చెప్పుకుంటూ రామరాజ్య స్థాపనకు తమకు సహకారం అందించాలని కోరగా.. అందుకు నిరాకరించటంతో దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు.. మోయినాబాద్ పోలీసులకు రంగరాజన్ ఫిర్యాదు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.