చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనను మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. ఈ పిరికి చర్యపై హిందు ధర్మ రక్షకుల నుంచి ఎలాంటి స్పందన లేదని ట్వీట్ చేశారు. దాడికి సంబంధించిన వీడియోలు ఉన్నా.. తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. 'ధర్మరక్షకులు దాడులు చేస్తే.. రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారు.' అని సెటైర్లు వేశారు.