హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ ఆలయంలో దర్శన సమయ వేళలపై గందరగోళం నెలకొంది. ఆలయ బోర్డులో ఒక సమయం, సోషల్ మీడియాలో మరో సమయం ఉండటంతో భక్తులు అయోమయానికి గురవుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనం ఉంటుందని బోర్డులో ఉండగా, సోషల్ మీడియాలో వేరే సమయం చూపిస్తుండటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై ఆలయ అధికారులు స్పందించి సరైన సమాచారం అందించాలని భక్తులు కోరుతున్నారు.