ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంత్రి నారా లోకేష్ చీపురు పట్టారు. మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో ఉన్న మంగళగిరి ఎకో పార్క్‌లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఎకో పార్క్‌లో చెత్తను నారా లోకేష్ స్వయంగా శుభ్రం చేసి, చెత్తకుండీలో వేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుడితో నారా లోకేష్ మాట్లాడారు. అతని యోగక్షేమాలు, కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మంగళగిరి ఎకో పార్కులో ఇంకా ఏం చేస్తే బాగుంటుందో అభిప్రాయం తెలుసుకున్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికుడిని శాలువాతో సత్కరించారు.