హైదారాబాద్‌లో గుట్టుగా సాగుతున్న గలీజు దందాను పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ రేంజ్‌లో ఓ వెబ్‌సైట్ పెట్టి మరీ.. విదేశీ యువతులతో చీకటి వ్యాపారం నడిపిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఓ ఇండిపెండెంట్ హౌస్ మీద దాడి చేసిన పోలీసులు.. ఏకంగా 17 మంది విదేశీ యువతులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడికి అరెస్ట్ చేశారు. వెబ్‌సైట్‌లో విదేశీ అమ్మాయిల ఫొటోలు పెట్టి విటులను ఆకర్షిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.