హైదరాబాద్‌లో అనుమతి లేకుండా చెట్లు నరికినందుకు గాను ఒక కంపెనీ భారీ మూల్యం చెల్లించింది. రూ20 లక్షల జరిమానా కట్టింది. కూకట్‌పల్లిలో ఉన్న గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్‌కు అటవీ శాఖ అధికారులు రూ.20 లక్షల జరిమానా విధించారు. సదరు కంపెనీ యాజమాన్యం అనుమతి లేకుండా చెట్లు నరికిందంటూ స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో అనుమతి లేకుండా చెట్లు నరికితే కఠిన చర్యలు తప్పవని అటవీశాఖ హెచ్చరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..